హైదరాబాద్,(విజయక్రాంతి): పదవి కోసం ముఖ్యమంత్రిని ఉపముఖ్యమంత్రి తప్పుదోవ పట్టిస్తున్నారా..?, లక్ష కోట్లు అప్పు తీసుకొచ్చి ఏం చేశారు..? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఫోర్త్ సిటీ ప్రాంతం వద్ద రేవంత్ కుటుంబానికి భూములు ఉన్నాయని ఆరోపించారు. వెల్దండలో రేవంత్ రెడ్డి కుటుంబానికి 600 ఎకరాల భూమి ఉంది. ఫోర్త్ సిటీ కోసం ఇస్తారా..? అని అడిగారు. రేవంత్ రెడ్డి తన బూములిస్తానంటే ప్రభుత్వ ధర కంటే ఎకరాకు తాము మరో రూ.5 లక్షలు ఎక్కువ ఇస్తామని కేటీఆర్ చెప్పారు. ఉన్న 14 వేల ఎకరాలు ఏం చేయాలో ముఖ్యమంత్రికి తెలియదన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీలో పరపతి లేదు, కేబినెట్ విస్తరణ ఆలస్యమే ఉదాహరణ అని ఎద్దేవా చేశారు. హరీశ్ రావు సహా బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెడుతున్నారని, కేసులకు భయపడేది లేదు..పోరాడుతునే ఉంటామని కేటీఆర్ పేర్కొన్నారు.