calender_icon.png 30 October, 2024 | 2:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నువ్వా.. కేసీఆర్ పేరు తుడిచేది..?: కేటీఆర్

30-10-2024 12:12:13 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ లో కీలక వ్యాఖ్యాలు చేశారు. పదవుల కోసం రేవంత్ రెడ్డి పరితపిస్తున్నప్పుడు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఉన్న పదవినే తృణప్రాయంగా వదిలేశారని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులపై గన్ను ఎక్కుపెట్టినప్పుడు కేసీఆర్ ప్రాణాన్నే పణంగా పెట్టి తెలంగాణ సాధించారని గుర్తు చేశారు. సాధించుకున్న తెలంగాణను చంపేందుకు రేవంత్ బ్యాగులు మోశారని ఆరోపించారు. రేవంత్ బ్యాగులు మోస్తున్నప్పుడు కేసీఆర్ రాష్ట్ర భవిష్యత్ కు ఊపిరిపోశాడని ఆయన తెలిపారు. చిట్టినాయుడు.. నువ్వా.. కేసీఆర్ పేరు తుడిచేది..? అని ప్రశ్నించారు. కేసీఆర్ అంటేనే తెలంగాణ చరిత్ర అని మాజీ మంత్రి కేటీఆర్ హర్షం వక్యం చేశారు.