calender_icon.png 15 November, 2024 | 9:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇది ప్రజాస్వామ్యం కాదు.. నిరంకుశత్వం.. అరాచకం

15-09-2024 09:38:26 AM

హైదరాబాద్: హైదరాబాద్లో భూములు తాకట్టు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఐటిపరిశ్రమలకు కేటాయించిన భూముల తాకట్టుకు యత్నిస్తున్నారని విమర్శించారు. సూమారు 400 వందల ఎకరాలు తాకట్టు పెట్టాలని ప్రభుత్వం యత్నిస్తున్నట్లు వెల్లడించారు. రూ, 10 వేల కోట్ల రుణాన్ని తీసుకోవడానికి ప్రయత్నం ప్రయత్నిస్తోందన్నారు. ఆ భూముల్లో ఐటి పరిశ్రమలు వచ్చి యువతకు ఉపాధి కల్పన జరగాలని ఆయన ఆకాంక్షించారు.

భూములు తాకట్టు పెడితే కొత్త పరిశ్రమలు ఎలా వస్తాయి ? అని కేటీఆర్ ప్రశ్నించారు. భూముల తాకట్టు ప్రతిపాదన ప్రభుత్వం విరమించుకోవాలని హెచ్చరించారు. ప్రజాస్వామ్యం జవాబుదారీతనంతోనే వర్ధిల్లుతుంది.. దౌర్జన్యంతో కాదని మాజీ మంత్రి సూచించారు. ప్రజల హక్కుల గురించి రాహుల్ గాంధీ ఏన్నో ఉపన్యాసాలు ఇస్తారు.. రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతుంటే రాహుల్ కళ్లు మూసుకున్నారు అని వ్యాఖ్యానించారు. బుల్ డోజర్లతో కూల్చడం, అసమ్మతిని అణిచివేయడమేనా ప్రజాస్వామ్యం?.. ప్రశ్నించే గొంతులను అణచివేయడమేనా ప్రజాస్వామ్యం?..  ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడమేనా ప్రజాస్వామ్యం?.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై దాడులు చేయడమేనా ప్రజాస్వామ్యం? అని ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్యం కాదు.. నిరంకుశత్వం.. అరాచకం అన్నారు.