మూడు జిల్లాల ప్రజాప్రతినిధులు హాజరు
హైదరాబాద్, మే 14 (విజయక్రాంతి): పార్లమెంటు ఎన్నికలు ముగియడంతో ఇక అన్ని పార్టీల దృష్టి పట్టభద్రుల ఎన్నికలపై పడింది. బుధవారం బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన వరంగల్, నల్లగొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల ప్రజాప్రతినిధులతో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు సమావేశం నిర్వహించనున్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై వ్యుహం, కార్యాచరణపై చర్చించి దిశానిర్దేశం చేయనున్నారు.
ఆయా జిల్లాలకు చెందిన సీనియర్ నాయకులంతా హాజరుకావాలని కోరారు. బీఆర్‌ఎస్ తరఫున ఏనుగుల రాకేశ్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ నెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటలవరకు పోలింగ్ జరగనుంది. జూన్ 5న కౌంటింగ్ నిర్వహిస్తారు. మూడు జిల్లాల పరిధిలో 4,61,806 మంది పట్టభద్రులు ఉండగా అందులో 2,87,007 మంది పురుషులు, 1,74,794 మంది మహిళలు, ఐదుగురు ట్రాన్స్‌జెండర్లు ఉన్నట్టు ఎన్నిక అధికారులు వెల్లడించారు.