హైదరాబాద్,(విజయక్రాంతి): సినీ నటుడు అల్లు అర్జున్(Allu Arjun) వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) స్పందించారు. ప్రచారం కోసమే సినిమా వాళ్ల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారని ఆరోపించారు. ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు ప్రయత్నించారని, అటెన్షన్, డైవర్షన్ కోసమే సీఎం పాకులాడుతున్నారని కేటీఆర్(KTR) విమర్శించారు. సినిమా వాళ్లతో సెటిల్మెంట్ చేసుకొని ఇప్పుడు మాట్లాడట్లేదని దుయ్యబట్టారు. గురుకులాల్లో చనిపోయిన విద్యార్థులు, ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ఇవ్వాలన్నారు. రైతున్నలు, నేతన్నల మరణాలపైనా ముఖ్యమంత్రి స్పందించి, అందరికీ కనీసం రూ.25 లక్షల పరిహరం చెల్లించాలని కాంగ్రెస్ సర్కార్ ను కేటీఆర్ డిమాండ్ చేశారు.