calender_icon.png 8 January, 2025 | 5:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుట్రలతో నా నోరు మూయించలేరు: కేటీఆర్

07-01-2025 04:03:51 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): తాజా పరిణామాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. నా మాటలను గుర్తించుకోండి అంటూ ఈ ఎదురుదెబ్బల నుంచి తాము బలంగా పుంజుకుంటామని కేటీఆర్ అన్నారు. ఈ అబద్ధాలు, ఆరోపణలు  తనన్ను దెబ్బతీయలేవని, తెలంగాణ ప్రభుత్వం కుట్రలతో నోరు మూయించలేరని కేటీఆర్ ఆగ్రహించారు. నేటి అడ్డంకులే రేపటి విజయానికి దారి తీస్తాయన్నారు. తాను న్యాయవ్యవస్థను గౌరవిస్తానని, న్యాయం గెలుస్తుందని అచంచలమైన నమ్మకం అని కేటీఆర్ చెప్పారు. తన పోరాటం సత్యం కోసం కొనసాగుతుందని, ఈ ప్రపంచమే సాక్షిగా నిలుస్తుందని కేసీఆర్ తెలిపారు. ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసులో ఎన్ పోర్మ్ మెంట్ డైరెక్టరేట్ కేటీఆర్ కు మరోసారి నోటీసులు జరీ చేసింది. ఈ నెల 16న విచారణకు రావాలని మంగళవారం ఇచ్చిన నోటీసులలో ఈడీ పేర్కొంది.