నన్ను అరెస్ట్ చేయాలని కుట్ర
నాపై ఏసీబీ, ఈడీ కేసులన్నీ తప్పుడు కేసులే: కేటీఆర్
హైదరాబాద్: ఫార్ములా-ఈ కేసులో న్యాయ నిపుణులతో సంప్రదిస్తున్నానని, న్యాయ నిపుణుల సూచనల మేరకు విచారణకు హాజరవుతానని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్(BRS Working President) అన్నారు. తనపై ఏసీబీ, ఈడీ కేసులన్నీ తప్పుడు కేసులేనని కేటీఆర్ కొట్టిపాడేశారు. తనను అరెస్టు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. కేసులు, అరెస్టులకు బీఆర్ఎస్ భయపడదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ తరుఫున సీఎం రేసులో కేటీఆర్, కవిత అని వస్తున్న వార్తలపై స్పందించిన కేటీఆర్(KTR) అది తప్పుడు ప్రచారమని వివరించారు. తమ సీఎం అభ్యర్థి ఎప్పటికీ కేసీఆరేనని క్లారిటీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం చెబుతామని కేటీఆర్ పేర్కొన్నారు.