calender_icon.png 24 October, 2024 | 12:03 AM

కాంగ్రెస్ నేతన్నలు, చేనేతల ప్రాణాలు తీస్తోంది : కేటీఆర్

09-07-2024 11:35:21 AM

హైదరాబాద్ : నేతన్నలు, చేనేతల ప్రాణాలను కాంగ్రెస్ ప్రభుత్వం తీస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. తాము అధికారంలో ఉన్నప్పుడు నేతన్నలు, చేనేతల ఆత్మహత్యలు నివారించి వారికి ఉపాధి కల్పించే ఉద్దేశంతో బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభించాం. కానీ సీఎం రేవంత్ రెడ్డి నేతన్నలు, చేనేతలపై కక్ష గట్టి బతుకమ్మ చీరల పంపిణీ నిలిపివేసేందుకు సీఎం కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

కాంగ్రెస్ పాలనలో 10 మంది నేతన్నల ఆత్మహత్యలు చేసుకున్నారని, అనాలోచిత నిర్ణయాలు మాని నేతన్నలు, చేనేతలకు ఉపాధి కల్పించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ సదుద్దేశంతో చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కారణంగా పేద మహిళలకు పండుగ పూట ప్రభుత్వ కానుకగా చీర అందేదన్నారు. అదే విధంగా చేనేత కార్మికులు, నేతన్నలు అనుబంధంగా ఎంతో మంది ఉపాధి పొందే వారన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు. ఏటా రూ. 350 కోట్ల బడ్జెట్ తో బతుకమ్మ, రంజాన్, క్రిస్ మస్ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కోటి చీరలను పంపిణీ చేసేదని గుర్తు చేశారు.