calender_icon.png 17 November, 2024 | 12:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అదాని-అంబానీలపై కాంగ్రెస్ పోరాటం ఓ భూటకం

17-11-2024 09:46:26 AM

హైదరాబాద్,(విజయక్రాంతి): బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి పలు ప్రశ్నలు సంధించారు. దేశవ్యాప్తంగా భూసేకరణపై కాంగ్రెస్ రణగర్జన చేస్తోందని, రాష్ట్రంలో అందుకు విరుద్ధం అన్నారు. కొడంగల్ రైతుల కన్నీటికి భూసేకరణ ఎందుకు కారణమైంది..?, తెలంగాణ కాంగ్రెస్ పాలిత రాష్ట్రమే కాదా.. అభ్యంతరం చెప్పలేదెందుకు..?, అదానీ-అంబానీలపై పోరాటం ఓ భూటకం అని కేటీఆర్ ఆరోపించారు. రామన్నపేటలో అదానీ పరిశ్రమకు ద్వారాలు ఎందుకు తెరిచింది..?, నేను కొట్టినట్లుచేస్తా.. నువ్వు ఏడ్చినట్లు చేయి అనే ఒప్పందమా..? అనేలా అదానీ కాంగ్రెస్ పార్టీ ఉన్నాయని విమర్శించారు. కుమ్మక్కు రాజకీయంలో ఇదో రహస్యమా..?, తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ తరతరాల దరిద్రం అని కేటీఆర్ మండిపడ్డారు.