calender_icon.png 5 October, 2024 | 12:32 PM

మూసి వెనకున్న ముసుగు దొంగ ఎవరు?

05-10-2024 10:29:18 AM

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రశ్నలవర్షం కురిపించారు. మూసి వెనక దాక్కున్న ముసుగు దొంగ ఎవరు?, రైతు రుణ మాఫీ ఎగ్గొట్టి, మూసి లో మురికి రాజకీయాలు చేస్తున్న మురికి దొంగ ఎవరు?, రైతు బంధు ఎగ్గొట్టి, మూసి పేదల ఉసురు పోసుకుంటున్న దుర్మార్గుడు ఎవరు?, మహిళలకు వంద రోజుల్లోనే నెలకు 2500 ఇస్తా అని చెప్పి తప్పించుకు తిరుగుతున్న మోసగాడు ఎవరు?, అవ్వ, తాతలకు నెలకు 4000 ఇస్తా అని చెప్పి ఎగ్గొట్టిన నయవంచకుడు ఎవరు?, ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం ఇస్తా అని మాట తప్పిన దగావీరుడు ఎవరు?, మూసి బ్యూటిఫికేషన్ పేరిట 1,500,000,000 కోట్ల లూటిఫికేషన్ కి తెరతీసిన ఘనుడు ఎవరు? అని కేటీఆర్ ప్రశ్నించారు.