calender_icon.png 15 November, 2024 | 8:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్వేలు సరే, పథకాలేవీ-పాలనేది..?: కేటీఆర్

11-11-2024 03:58:10 PM

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరోసారి సోషల్ మీడియా ఎక్స్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ పాలనపై ప్రశ్నల వర్షం కురిపించాడు. తెలంగాణలో నడుస్తున్నది ప్రజాపాలనా..? ప్రతీకార పాలనా..? అన్నారు. సర్వేలు సరే, పథకాలేవీ-పాలనేది..? ఉన్నవి ఉంచుతారా, ఊడబీకుతారా ప్రజల ప్రశ్నలకు సమాధానమేది..?, అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా ఆరు గ్యారంటీలను ఎందుకు అమలుచేయడం లేదు..? కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు పట్టించుకోవట్లేదు.. ?, ధాన్యం కొనుగోలు కేంద్రాలకు కొనే నాధుడు లేక రైతన్నలు కన్నీళ్లు పెడుతున్నా కాంగ్రెస్ అధిష్టానం గుండె కరగదా..? హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇండ్లు కూలుస్తున్నా, వాళ్లు గుండెలవిసేలా రోదిస్తున్నా కాంగ్రెస్ అధిష్టానానికి చలనం రాదా..?  అన్నారు.

ఎకరాకు ఏడాదికి రూ.15000 , రైతుభరోసా అందక రైతన్నలు పెట్టుబడుల కోసం తిప్పలు పడుతున్నా కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు స్పందించదు..?, అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.2 లక్షల రుణమాఫీ అని అరకొర రుణమాఫీతో రైతులను అరిగోస పెడుతున్నా కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు పట్టించుకోదు..? సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలలో ప్రతిరోజూ ఫుడ్ పాయిజన్ జరిగి విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతున్నా ఎందుకు కనీసం సమీక్షించరు..?, ఎన్నికలకు ముందు నిరుద్యోగులను వాడుకుని ఇప్పుడు గ్రూప్ 1,2,3,4 పరీక్షలపై వారు అడుగుతున్న డిమాండ్లను ఎందుకు నెరవేర్చరు..? ఆడబిడ్డలకు మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ.2500 ఏమయింది..? అవ్వ, తాతలకు నెలకు రూ.4,000 పింఛన్ ఎప్పటి నుండి ఇస్తారు..? రాష్ట్రంలో నడుస్తున్నది ఏసీబీ, జేసీబీ సర్కార్..  కాంగ్రెస్ సర్కార్ కు కూల్చడం తప్ప నిలబెట్టడం తెలియని ఫైర్ అయ్యారు.  రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు నోరు మెదపదు..? రాష్ట్రం నుండి మూటలు వస్తున్నందుకే రాహుల్ మాటలు మూగబోయాయా..? అని కేటీఆర్ ప్రశ్నించారు.