calender_icon.png 3 November, 2024 | 3:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రేమను పెంచడం అంటే ఇదేనా... రాహుల్ జీ ?

15-05-2024 12:23:09 PM

హైదరాబాద్: అచ్చంపేటలో బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ నేతల దాడులపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్పందించారు. మీరు చెప్పే ప్రేమను పెంచడం అంటే ఇదేనా.. రాహుల్ జీ? అని ప్రశ్నించారు. అధికార దుర్వినియోగంతో ప్రత్యర్థులపై దాడులు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. దాడులు, దుర్భాషల్లో పోలీసులూ భాగస్వాములు కావడం సిగ్గుచేటు అని ఆయన మండిపడ్డారు.  స్థానిక పోలీసుల ఎదురుగానే నిన్న అచ్చంపేట పట్టణంలో బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ నేతల దాడి చేశారు. ఆగంతకులు యధేచ్చగా హత్యాయత్నం చేస్తుంటే పోలీసు అధికారి టాబ్లెట్ పట్టుకొని చోద్యం చూస్తున్నారు. ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే అని బాధితుల కుటుంబీకులు ప్రశ్నిస్తున్నారు.