calender_icon.png 23 October, 2024 | 5:51 PM

ఇప్పటికైనా మీరు లెంపలేసుకుంటారా..?: కేటీఆర్

23-10-2024 03:33:19 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విధించిన పిరాయింపులను సొంత పార్టీ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డినే తప్పుబడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఇప్పటికైన తప్పు ఒప్పుకుని క్షమాపణలు చెబుతారా అని, పిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటారా అని  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు.ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకులే కాంగ్రెస్ పార్టీ విధి విధానాలకు వ్యతిరేకిస్తున్నారు. గడప గడపకు వెళ్లి కాంగ్రెస్ లో చేర్చుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చట్ట ప్రకారం వేటు వేయల్సిందేనని పట్టుబడుతున్నారని కేటఆర్ వెల్లడించారు. ఇప్పటికైనా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు ఉంటాయా..? ఇప్పుడు రాయితో కొట్టాల్సింది ఎవరిని..? ఫిరాయించిన ఎమ్మెల్యేలనా..? ప్రోత్సహించిన మిమ్ములనా..? అని కేటీఆర్  ఫైర్ అయ్యారు.