హైదరాబాద్, నవంబర్ 24 (విజయక్రాంతి): ఆర్థిక సమస్యలతో ఉన్నత చదువులు అభ్యసించలేకపోతున్న దివ్యాంగ విద్యార్థికి బీఆర్ఎస్ నేత కేటీఆర్ అండగా నిలిచారు. తొర్రూర్ మండలం నాంచారి మడూర్ గ్రామానికి చెందిన గిడ్లే విష్ణు చిన్నతనంలోనే రోడ్డు ప్రమాదంలో కాళ్లు పొగొట్టుకున్నాడు. 10వ తరగతి పూర్తి చేసుకున్న విష్ణు హైదరాబాద్‌లో కంప్యూటర్ శిక్ష ణ పొందుతూ గాంధీనగర్‌లోని ఓప్రైవేట్ హాస్టల్ ఉంటున్నాడు.
హాస్టల్ ఫీజు చెల్లించే స్థోమత లేక ఆదివారం తెలంగాణ భవన్‌కు వెళ్లి కేటీఆర్‌ను కలిసి సమస్యను వివరించారు. స్పం దించిన కేటీఆర్ వెంటనే కోచింగ్ పూర్తి అయ్యేవరకు హాస్టల్ ఫీజు చెల్లిస్తానని హామీ ఇస్తూ నగదును అందజేశారు.