calender_icon.png 14 November, 2024 | 4:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హతలేని కంపెనీకి భారీ పనులు

12-11-2024 01:11:26 PM

న్యూఢిల్లీ,(విజయక్రాంతి): ఫిబ్రవరిలో అమృత్ 2.0 ఫథకం టెండర్లు పిలిచారని బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో 8 ప్యాకేజీల కింద అమృత్ పథకం మొత్తం రూ.8 వేల కోట్లకు పైగా వ్యయంతో టెండర్లు పిలిచారని కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి టాక్స్ వసూలు చేస్తున్నాడని స్వయంగా చెప్పిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అక్రమ వసూళ్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు..? అని ప్రశ్నించారు. అమృత్ స్కీం టెండర్లలో రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రూ.వేల కోట్ల టెండర్ల అక్రమంగా కట్టబెట్టారని ఆధారాలతో సహా బయటపెడితే కేంద్రం ప్రభుత్వం ఏం చేస్తుందని కేటీఆర్ అడిగారు.

అమృత్ పథకం టెండర్లకు సంబంధించి వెబ్ సైట్ లో వివరాలు లేవని చెప్పారు. సీఎం బావమరిది కంపెనీ శోధ కన్ స్ట్రక్షన్ కు రూ.1137 కోట్లకు సంబంధించిన భారీ పనులు అప్పగించారు. 2021-22లో శోధ కన్ స్ట్రక్షన్స్ నికర ఆదాయం రూ.2.2 కోట్లు మాత్రమే అని, ఎలాంటి అర్హత లేని చిన్న కంపెనీకి భారీ పనులు అప్పగించడం ఏంటాని ప్రశ్నించారు. టెండర్ల విషయమై కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు తెలంగాణలో కంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన టెండర్లను రద్దు చేయాలని ఫిర్యాదు చేశామన్నారు. అమృత్ పథకం టెండర్ల విషయమై విచారణ చేపట్టాలని కోరామని చెప్పారు. ఎంపీ ఎన్నికల సమయంలో కంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ ఆరోపణలు చేశారని గుర్తు చేశారు.