calender_icon.png 27 September, 2024 | 4:51 PM

నేతన్నల తరపున పోరాటానికి బీఆర్ఎస్ సిద్ధం

26-09-2024 03:30:13 PM

రాజన్నసిరిసిల్ల, (విజయక్రాంతి): బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ గురువారం సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. బీఆర్ఎస్ హయాంలో సిరిసిల్లలో ఉపాధి కల్పనతో నేతన్నల ఆత్మహత్యాలు తగ్గాయని ఆయన పేర్కొన్నారు. సిరిసిల్ల నేతన్నలకు రూ.3312 కోట్ల ఆర్ఢర్లు ఇచ్చామని, సిరిసిల్లను మరో తిరుప్పూరు చేయడానికి కృషి చేశామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బతుకమ్మ చీరల ఆర్డర్లను నిలిపివేశారని కేటీఆర్ ఆరోపించారు.

బతుకమ్మ చీరల్లో కుంభకోణం జరిగిందని ఆరోపించారని, బతుకమ్మ చీరలపై విచారణ చేయాలని అసెంబ్లీ సాక్షిగా చెప్పామని బీఆర్ఎస్ మాజీ మంత్రి తెలిపారు. సిరిసిల్ల నేతన్నల తరపున రాష్ట్ర ప్రభుత్వంతో పోరాటానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉన్నామని, కానీ తమ పోరాటానికి నేతన్నలు కూడా సహకరించాలని కోరారు. నేతన్నల ఆత్మహత్యాలు నిలిచిన పరిస్థితి నుంచి మళ్లీ మొదలయ్యాయని కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు.