calender_icon.png 18 April, 2025 | 9:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెచ్‌సీయూ భూముల వెనుక భారీ స్కాం.. ఆధారాలు బయటపెట్టిన కేటీఆర్

11-04-2025 12:00:14 PM

కాంగ్రెస్ ప్రభుత్వం 3డీ మంత్ర అమలు చేస్తోంది

400 ఎకరాలు అటవీ భూమే

అటవీ భూమిని రేవంత్ సర్కార్ తాకట్టు పెట్టింది

రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీ ఆర్థిక నేరానికి పాల్పడింది

హైదరాబాద్: కంచ గచ్చిబౌలి భూముల్లో(Kancha Gachibowli lands) చెట్లు నరికివేతపై పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం చేశారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ. 10 వేల కోట్ల కుంభకోణానికి ప్రయత్నిస్తోందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీ ఆర్థిక నేరానికి తెరలేపిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 3డీ మంత్ర అమలు చేస్తోందని కేటీఆర్(K. T. Rama Rao) సూచించారు. మోసం.. విధ్వసం.. దృష్టిమళ్లించడమే కాంగ్రెస్ ప్రభుత్వం విధానామని విమర్శించారు.

400 ఏకరాలు అటవీ భూమే, సుప్రీంకోర్టుల తీర్పుల ఆధారంగా ఆ 400 ఎకరాలు అటవీ భూమి అని చెబుతున్నానని పేర్కొన్నారు. సుప్రీం కోర్టు తీర్పు(Supreme Court Judgment) ఇవ్వడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు కూడా ఇచ్చిందన్నారు. అడవులకు ఉండాల్సిన లక్షణాలున్న భూముల లెక్క తీయమని సుప్రీంకోర్టు రాష్ట్రప్రభుత్వాలను అడిగింది.. సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం(Revanth Reddy government) ఒక కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. అటవీ భూమిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాకట్టు పెట్టింది.. అటవీ భూమిని తాకట్టు పెట్టడం, అమ్మే హక్కు ప్రభుత్వాలకు ఉండదని కేటీఆర్ వివరించారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఓ బీజేపీ ఎంపీ పూర్తిస్థాయిలో సహకరించారని కేటీఆర్ స్పష్టం చేశారు.