కామన్వెల్త్ క్రీడలంటే కాంగ్రెస్ చేసిన కుంభకోణం
హైదరాబాద్: చంద్రబాబు కన్న కలను మేము నెరవేర్చామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో గురువారం ప్రెస్ మీట్ అన్నారు. 2003లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో ఎఫ్1 నిర్వహించాలని సీఈఓకు కలిసినట్లు చెప్పారు. ఫార్ములా-1 రేసింగ్ తొలిసారి 1946లో జరిగిందని, ఫార్ములా-1 రేసింగ్ నిర్వహణకు అనేక దేశాలు పోటీ పడతాయని, భారత్ లో ఫార్ములా-1 రేసింగ్ నిర్వహించాలని 2023లోనే చంద్రబాబు ఆశించారని, ఎంతమంది ప్రయత్నించినా భారత్ లో ఫార్ములా రేసింగ్ సాధ్యం కాలేదని కేటీఆర్ గుర్తుచేశారు. 1984లో ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు జరిగాయి. కామన్వెల్త్ క్రీడల కోసం రూ. 70.608 కోట్లు ఖర్చు చేశారని కేటీఆర్ తెలిపారు. అంతర్జాతీయ క్రీడల నిర్వహణకు ప్రభుత్వాలు ఖర్చు చేయడం సర్వసాధారణం అన్నారు. కామన్వెల్త్ క్రీడలంటే కాంగ్రెస్ చేసిన కుంభకోణం గుర్తొస్తుందని కేటీఆర్ ఆరోపించారు. కామన్వెల్త్ క్రీడల కోసం ఒరిజినల్ కాస్ట్ కంటే 100 రెట్లకు పైగా కాంగ్రెస్ ఖర్చు చేసిందని వ్యాఖ్యానించారు. ఫార్ములా ఈ రేస్ నిర్వహణకు సియోల్, జోహనస్ బర్గ్ పోటీ పడ్డాయి. సియోల్, జోహనస్ బర్గ్ ను వెనక్కి నెట్టి హైదరాబాద్ లో నిర్వహించేలా చేశామని కేటీఆర్ చెప్పారు.