calender_icon.png 18 November, 2024 | 4:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారం ఎవరికీ శాశ్వతం కాదు సీఎం: కేటీఆర్

14-09-2024 12:26:44 PM

హైదరాబాద్: అధికారం ఎవరికీ శాశ్వతం కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. హైడ్రా అని హైడ్రామాలు చేశారని మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ దుష్ట సంప్రదాయాలకు తెరలేపుతున్నారని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి సృష్టిస్తున్న దుష్ట సంప్రదాయాలు ఆయన మెడకే చుట్టుకుంటాయన్నారు. సీఎం ప్రాంతీయ విభేదాలను రెచ్చగొడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్ ప్రజల మీద రేవంత్ రెడ్డి పగబట్టారని తెలిపారు. హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు రాలేదని సీఎం పగబట్టారని చెప్పారు. కొండాపూర్ లోని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీద అరికెపూడి గాంధీ, అనుచరులు దాడి చేసిన నేపథ్యంలో వారి కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. గత పదేళ్లలో ఇలాంటి దాడులు ఎప్పుడూ జరగలేదన్న కేటీఆర్ హోంమంత్రి తన దగ్గరే పెట్టుకొని రేవంత్ రెడ్డి శాంతి భద్రతలు కాపడలేకపోయారని మండిపడ్డారు.