calender_icon.png 18 October, 2024 | 7:39 PM

రూ. 1.50 లక్షల కోట్లు ఎందుకు..?: కేటీఆర్

18-10-2024 05:24:35 PM

హైదరాబాద్: మూసీ సుందరీకరణకు రూ. 1.50 లక్షల కోట్లు ఎందుకు? అని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. రూ. 3800 కోట్లతో డ్రైనేజీ సీవరేజ్ ప్రాజెక్టు పనులు ప్రారంభించామని కేటీఆర్ మూసీపై ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో తెలిపారు. రూ. 50 వేల కోట్లతో మూసీని ప్రక్షాళన చేస్తామని గతంలో ముఖ్యమంత్రి చెప్పారు. రూ. లక్షా 50 వేల కోట్లతో మూసీ సుందరీకరిస్తామని సీఎం మాట మార్చారని కేటీఆర్ ధ్వజమెత్తారు. తుదిదశంలో ఎస్టీపీలు, సీవరేజ్ ప్లాంట్ లు ఉన్నాయని చెప్పారు. కేవలం రూ. 1100 కోట్లతో నల్గొండకు శుద్ధమైన నీరు ఇవ్వవచ్చు.. రూ. 25 వేల కోట్లతో మూసీ ప్రక్షాళన చేయవచ్చు  కేటీఆర్ తెలిపారు. పేదల ఇళ్ల జోలికి వెళ్లకుండానే మూసీని ప్రక్షాళన చేయవచ్చని సూచించారు. మూసీ ప్రక్షాళన అంటూ వికారాబాద్ అడవుల్లో వనమేధం, మూసీ ప్రక్షాళన అంటూ హైదరాబాద్ లో గృహమేధం చేస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ ప్రక్షాళన కోసం వికారాబాద్ అడవుల్లో 12 వేల చెట్లు నరికేస్తున్నారని ఫైర్ అయ్యారు. మూసీ ప్రక్షాళన అంటూ అవినీతి చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. నమోమి గంగా ప్రాజెక్టు వ్యయం రూ. 40 వేల కోట్లే అన్నారు.