10-04-2025 01:52:19 AM
సిరిసిల్ల, ఏప్రిల్9 (విజయక్రాంతి): మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు బుధవారం కోనరావుపేట మండలంలోని మల్కపేట సీతారామ చంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా మల్కాపేట వాస్తవ్యులు చల్మెడ ఆనందరావు వారి కుటుంబ సభ్యులు సమక్షంలో ప్రతిష్టించబడిన సీతారామచంద్ర హనుమసమేత రా మాలయంలో ప్రథమ వార్షికోత్సవం సం దర్భంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాల వేడుకలలో కేటీఆర్, బిఆర్‌ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీ నరసింహారావులు మండల నాయకులతో కలిసి పాల్గొన్నారు.
-----రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ లో నిర్వహించిన హనుమాన్ పూజలో టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ పాల్గొన్నారు. హనుమాన్ దీక్ష పరులతో కలిసి సహపంక్తి భోజనం (భిక్ష) చేశారు. హనుమాన్ దీక్ష పరుల భజన, శ్రీరామ నామ జపంతో మార్మోగిన తెలంగాణ భవనం పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో వెల్లివెరిసాయి.