calender_icon.png 13 January, 2025 | 2:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మందా జగన్నాథం భౌతికకాయానికి నివాళులర్పించిన కేటీఆర్

13-01-2025 12:07:13 PM

హైదరాబాద్‌: మాజీ ఎంపీ మందా జగన్నాధం భౌతికకాయానికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు(Working President of BRS is KT Rama Rao) సోమవారం చంపాపేటలోని ఆయన నివాసంలో నివాళులర్పించారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. జగన్నాధం 73 ఏళ్ల వయసులో అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా కేటీఆర్(KTR) మాట్లాడుతూ.. తెలంగాణలో ముఖ్యంగా పాలమూరు ప్రాంతంలో రాజకీయాలకు, ప్రజాసేవకు జగన్నాధం చేసిన సేవలను కొనియాడారు. ‘‘తెలంగాణ సీనియర్‌ రాజకీయవేత్తను కోల్పోయింది. మందా జగన్నాధం నాలుగుసార్లు ఎంపీగా చేసిన సేవ మరువలేనిది. ఆయన వివాదరహితుడు, పూర్వపు మహబూబ్‌నగర్ జిల్లా(Mahbubnagar District) అభివృద్ధికి, తెలంగాణ సంక్షేమానికి అంకితమైన సున్నిత నాయకుడు”అని జగన్నాధం ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని కేటీఆర్ పేర్కొన్నారు.