calender_icon.png 15 April, 2025 | 10:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డా. బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించిన కేటీఆర్

14-04-2025 12:48:19 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి కార్యక్రమం తెలంగాణ భవన్ లో ఘనంగా జరిగింది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ మహానీయుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వరంగల్ లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఆటో సంఘాలు మద్దతు తెలిపాయి. సభ నిర్వహణ కోసం ఆటో యూనియన్ రూ. 26వేల విరాళం చెక్కును తెలంగాణ భవన్ లో కేటీఆర్ కు అందజేశారు. అనంతరం ఆయన ఆటో డ్రైవర్లతో మాట్లాడి, వారి కష్ట సుఖాలను తెలుసుకున్నారు. మీ నుంచి ఇంతపెద్ద సహాయం వద్దని, చనిపోయిన ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ఈ సహాయం అందచేయాలని, ఆ చెక్కును మళ్ళీ ఆటో డ్రైవర్ల యూనియన్ కు కేటీఆర్ అందజేశారు.