calender_icon.png 25 October, 2024 | 1:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తున్నాం: కేటీఆర్

25-10-2024 11:40:45 AM

తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి బహిరంగ విచారణ

రాష్ట్రంలో ఇంటింటికీ తాగునీరు ఇచ్చిన ఘనత మాదే

రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయి

సిరిసిల్ల నేతన్నలను ప్రభుత్వం ఆదుకోవాలి

హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి బహిరంగ విచారణలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ విచారణలో మాట్లాడారు. పేద, మధ్యతరగతి వర్గాలను ఇబ్బంది పెడుతున్నారు. అన్ని రకాల పరిశ్రమలకు ఇచ్చే విద్యుత్ ను ఒకేగాటున కట్టడం సరికాదని సూచించారు. అన్నింటినీ ఒకే క్యాటగిరీలోకి తెస్తే చిన్న పరిశ్రమలు నష్టపోతాయన్నారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయని హెచ్చరించారు. ఎంఎస్ఎంఈలను, కుటీర పరిశ్రమలను కాపాడుకోవాలని తెలిపారు.  తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికీ తాగునీరు ఇచ్చిన ఘనత తమదని కేటీఆర్ స్పష్టం చేశారు. సిరిసిల్ల నేతన్నలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. విద్యుత్ ఛార్జీలను ఐదురెట్లు పంచే ప్రతిపాదనలను వ్యతిరేకిస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు.