calender_icon.png 5 November, 2024 | 7:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా తాతకు 400 ఎకరాల ఆస్తి ఉండేది: కేటీఆర్

05-11-2024 04:39:06 PM

హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రైతులకు మేలు చేయాలని పాలకులు ఆలోచించలేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శ్రీనగర్ కాలనీలో తెలంగాణ రియల్టర్స్ ఫోరం సమావేశం పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ... మా తాతకు 400 ఎకరాలు ఆస్తి ఉండేది.. అన్ని ఎకరాలున్నా నీళ్లు లేకపోయేసరికి నిరుపయోగంగా ఉండేదని తెలిపారు. 2014కు ముందు రాష్ట్రంలో భూముల ధరలు చాలా తక్కువ ఉండేవన్న కేటీఆర్, కేసీఆర్ కృషి వల్ల రాష్ట్రంలో భూముల ధరలు పెరిగాయని గుర్తుచేశారు. కేసీఆర్ నాయకత్వంలో సాగునీటి సదుపాయాలు మెరుగయ్యాయని తెలిపారు. ఎన్నికల ముందు మార్పు.. మార్పు అని కాంగ్రెస్ నేతలు ఊదరగొట్టారని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు పెట్టుబడులు రావని భయపెట్టారు. ప్రత్యేక తెలంగాణ వచ్చినప్పుడు 2 రోజులు పవర్ హాలుడే ఉండేదన్నారు. వ్యవసాయం చేయాలంటే రైతు అర్ధరాత్రి వరకు మేల్కొవాల్సి వచ్చేదని కేటీఆర్ గుర్తుచేశారు. సమగ్ర, సమ్మిళిత, సమీకృత అభివృద్ధిని కేసీఆర్ తీసుకొచ్చారని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడ చూసిన ఎకరం రూ. 15 లక్షలకు పైనే ఉందని కేటీఆర్ పేర్కొన్నారు.