calender_icon.png 29 November, 2024 | 6:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణకు పునఃర్జన్మనిచ్చింది కరీంనగర్

29-11-2024 03:27:43 PM

మనకొండూర్,(విజయక్రాంతి): తెలంగాణకు పునఃర్జన్మనిచ్చింది కరీంనగర్ అని బీఆర్ఎస్  వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కరీంనగర్ జిల్లా అలుగునూర్ వద్ద బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణ అధ్యక్షతన జరిగిన దీక్షా దీవస్ సభకు కేటీఆర్ ముఖ్య అతిథీగా హాజరయ్యారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ... కరీంనగర్ ప్రజలు ఉద్యమ స్పూర్తి చూపకుంటే తెలంగాణ వచ్చేది కాదన్నారు. 1956 నుంచి 1968వరకు తెలంగాణ కు అన్యాయం జరిగిందని, 1969 నుంచి తెలంగాణ ఉద్యమం మొదలైంది. తొలిదశ ఉద్యమంలో 370 మంది బలిదానం అయ్యారు. 1971 నుంచి 30 ఏళ్ళ పాటు మేధావులు, ఉద్యమకారులు ఎదురు చూశారని, అప్పుడే కలిసివచ్చే కాలానికి కేసిఆర్ నడిచి వచ్చిండాని కేఆయన వ్యాఖ్యానించారు.

కరీంనగర్ సింహగర్జనతో ఉద్యమాకికి బాట పడ్డిందని, పదవులు త్యాగం చేసి 2001లో టీఆర్ఎస్ ను స్థాపించి రాజీలేని పోరాటంతో చావు నోట్లో తల పెట్టి తెలంగాణ సాధించారని గుర్తు చేశారు. 2001 నుంచి 2014 వరకు ఉవ్వెత్తున ఎగసిన ప్రజా ఉద్యమంతో విధిలేని పరిస్థితుల్లో ఆనాడు కాంగ్రెస్ రాష్ట్రం ఇచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్రం సాధించిన ఘనత కేసిఆర్  కు తెలంగాణ ప్రజలకు దక్కుతుందన్నారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్ అడుక్కునే పరిస్థితి అని నేడు గద్దెనెక్కిన కాంగ్రెస్ నాయకులు అంటున్నారని మండిపడ్డారు. కేసిఆర్ కాలి గోరుకు సరిపోడు అని రేవంత్ పై ధ్వజమెత్తారు. దమ్ముంటే రా... పోదాం ఎక్కడికైనా ఏడాది పాలన ఎలా ఉందో ప్రజలు చెబుతారన్నారు. అధికారంలోకి రాగానే ఏదో సాధించినట్లు విజయోత్సవాలు నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.