‘ఎక్స్’లో కాంగ్రెస్ కౌంటర్
హైదరాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీ రంగం కుదేలైందని కేటీఆర్ చేసిన ట్వీట్‌కు కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. రాష్ట్రాన్ని, హైదరాబాద్ అభివృద్ధికి నిర్మాణాత్మక ఆలోచనల ను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పింది. కేటీఆర్ లెక్కలు చూస్తే సెల్ఫ్‌గోల్ చేసుకున్నారని సెటైర్ వేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి మొదటి 3 త్రైమాసికాల్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉందని, మీ హయాంలోనే ఐటీ ఎగుమతులుపడిపోయాయని ఒప్పుకుంటున్నారా? అని ప్రశ్నించింది.