calender_icon.png 23 December, 2024 | 9:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుబంధుతోనే సాగు విస్తీర్ణం పెరిగింది: కేటీఆర్

21-12-2024 11:10:36 AM

సాగు విస్తీర్ణం పెరగాలనే ఉద్దేశంతోనే రైతుబంధు ఇచ్చాం 

ఎన్ని పంటలకు ఇస్తారు.. ఏయే పంటలకు ఇస్తారో చెప్పాలి

హైదరాబాద్: రైతుబంధుపై శాసనసభలో సమగ్రంగా చర్చ జరగాలని మాజీ మంత్రి కేటీఆర్ కోరారు. బీఆర్ఎస్ హయాంలో రైతు ఆత్మహత్యలు తగ్గాయని చెప్పారు. దేశంలోనే రైతు ఆత్మహత్యలు అత్యల్పంగా నమోదవుతున్న రాష్ట్ర తెలంగాణే అన్నారు. 11.5 శాతం ఉన్నరైతు ఆత్మహత్యలను 1.5 శాతానికి తగ్గించామని కేటీఆర్ వెల్లడించారు. రైతుబంధుతోనే సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. రైతుభరోసా ఎన్ని పంటలకు ఇస్తారు.. ఏయే పంటలకు ఇస్తారో ప్రభుత్వం చెప్పాలని కేటీఆర్ కోరారు. దీనిపై స్పందించిన మంత్రి తుమ్మల రైతుభరోసా విషయంలో ఇంత వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని చెప్పారు. ప్రజలు, ప్రతిపక్షం సూచనలు ప్రకారం విధివిధానాలు రూపొందిస్తామన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒకసారి మాత్రమే రూ, 7,600 కోట్లు ఇచ్చామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల చెప్పారని కేటీఆర్ అన్నారు. రైతుబంధు కేసీఆర్ ప్రవేశపెట్టారు. మంత్రి తుమ్మల స్వయానా రైతు.. తనకు ఆత్మీయ మిత్రుడని కేటీఆర్ వెల్లడించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 73 వేల కోట్లు జమ చేసిందని మంత్రి తుమ్మల చెప్పారు. రైతుబంధులో రూ. 21,283 కోట్లు దుర్వినియోగం జరిగిందని అన్నారు. 2019-20లో సాగు విస్తీర్ణం 141 లక్షల ఎకరాలని మంత్రే చెప్పారని కేటీఆర్ తెలిపారు. 2020-21 లో సాగు విస్తీర్ణం 204 లక్షల ఎకరాలు అని మీరు ఇచ్చి నివేదికలో ఉందన్నారు. రైతు బంధు ఇవ్వడం వల్లే సాగు విస్తీర్ణం 2 కోట్ల ఎకరాలకు పెరిగిందన్నారు. సాగు విస్తీర్ణం పెరగాలనే ఉద్దేశంతోనే రైతుబంధు ఇచ్చామని వెల్లడించారు. ప్రభుత్వం ఇచ్చిన నోట్ అదే చెబుతోందని కేటీఆర్ పేర్కొన్నారు.