calender_icon.png 23 February, 2025 | 7:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్‌కు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదు

22-02-2025 11:33:07 PM

ఖమ్మంలో రైతులకు బేడీలు వేసింది మీరు కాదా..? 

బీఆర్‌ఎస్ తీరును చూస్తుంటే.. 

శవాల మీద పేలాలు ఏరుకునే విధంగా ఉంది 

రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఫైర్ 

హైదరాబాద్,(విజయక్రాంతి): బీఆర్‌ఎస్ తీరు చూస్తుంటే శవాల మీద పేలాలు ఏరుకునే విధంగా  ఉందని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. కేటీఆర్‌కు రైతులు గురంచి మాట్లాడే హక్కు లేదని, ఖమ్మంలో రైతులకు బేడీలు వేసింది గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాదా..? అని శనివారం ఆయన ఒక ప్రకటనలో  నిలదీశారు. అనేక సమస్యలను ఎదుర్కొంటూ రైతులు వ్యవసాయం చేస్తుంటే ఆపద వచ్చినప్పుడు ఆదుకోవాలని, కానీ రైతుల సమస్యలను రాజకీయం చేయడం నీచమైన సంప్రదాయమని ఆయన మండిపడ్డారు. బీఆర్‌ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కూడా పనికిరాదన్నారు. కేసీఆర్ ప్రతిపక్షనాయకుడిగా అన్ని హోదాలను అనుభవిసతూ అసెంబ్లీలో అడుగుపెట్టకపోవడం చరిత్రలో కేసీఆర్ నిలిచిపోతారని కోదండరెడ్డి విమర్శించారు.  భూ  రికార్డుల సవరణతో పేరుతో తీసుకొచ్చిన ధరణితో విదేశీ కంపెనీలకు రైతుల భూమి వివరాలు, ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా నెంబర్లను ఐటీ శాఖ మంత్రిగా కేటీఆరే అప్పగించారని ఆయన మండిపడ్డారు. ధరణి దేశంలోనే ఒక భూ కుంభకోణమని, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన నిర్వాకంతో ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇప్పుడు తగుదునమ్మా అంటూ రైతులపై కేటీఆర్ మొసలీ కన్నీరు కార్చుతున్నారని కోదండరెడ్డి మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టును నిపుణలు వ్యతిరేకించినా.. అనుమతులు లేకుండానే నిర్మించి జేబులు నింపుకున్నారని ఆయన ఆరోపించారు. టీఆర్‌ఎస్ పార్టీని బీఆర్‌ఎస్‌గా మార్చుకున్నప్పుడే .. తెలంగాణ పదాన్ని ఉచ్చరించే నైతిక హక్కును కోల్పోయారని ఆయన వ్యాఖ్యానించారు. 

కుల గణనతో సీఎం..  బీసీలకు పెద్దన్న అయ్యాడు బాంధవడుయ్యాడు

 పీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్

తెలంగాణలో కుల గణన చేసిన చరిత్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికే దక్కిందని పీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ అన్నారు.  ఈ   కుల గణనతో సీఎం  బీసీలకు బాంధవుడు, పెద్దన్న  అయ్యాడని, సీఎంతో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ చరిత్రలో ఉంటారని ఆయన తెలిపారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కుల గణనతో రాష్ట్రంలో బీసీలకు దక్కిన గొప్ప అవకాశంగా భావించాలన్నారు. బీసీలను అన్ని రంగ్లా అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా బీసీల చేసిందని, సీఎం ప్రత్యేక చొరవ తీసుకన్నారని ఆయన చెప్పారు. బీఆర్‌ఎస్, బీజేపీలు చేస్తున్న విష ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను గాంధీభవన్‌లో పెద్ద కార్యక్రమం పెట్టి సన్మానం చేస్తామన్నారు.