హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు(BRS Working President K.T. Rama Rao) రాజకీయంగా పార్టీ మారిన ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ సుప్రీంకోర్టు(Supreme Court of India)ను ఆశ్రయించారు. కేటీఆర్ పిటిషన్(KTR Petition) పై జస్టిస్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం విచారించింది. ఈ పిటిషన్, ఇదే విషయంలో దాఖలైన మరో సంబంధిత పిటిషన్‌తో జత చేసింది. ఈ కేసును ఫిబ్రవరి 10న పాత పిటిషన్ తో కలిపి విచారిస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది.