calender_icon.png 20 January, 2025 | 11:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సినీ గేయ రచయిత వడ్డెపల్లి కృష్ణ మృతికి కేటీఆర్ సంతాపం

06-09-2024 01:39:55 PM

హైదరాబాద్: సినీ గేయ రచయిత వడ్డెపల్లి కృష్ణ మృతికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం తెలిపారు. సినీ గేయ రచయిత వడ్డెపల్లి కృష్ణ  మరణ వార్త ఎంతో బాధించిందని కేటీఆర్ పేర్కొన్నారు. సిరిసిల్లలోని చేనేత కుటుంబంలో పుట్టిన ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. రచయితగా, పరిశోధకుడిగా, దర్శకుడిగా పలు రంగాల్లో అద్భుతమైన ప్రతిభతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. సాహిత్య రంగంలో వడ్డెపల్లి కృష్ణ సేవలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కడం విశేషం అన్నారు. ఆయనతో ఎప్పుడు మాట్లాడినా సాహిత్యానికి మరింత సేవ చేయాలనే తపన కనిపించేదన్నారు. లలిత గీతాల రచయితగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారని, కృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు. కుటుంబ సభ్యులు, బంధువులు, శ్రేయోభిలాషులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. కష్టకాలంలో కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని కేటీఆర్ పేర్కొన్నారు.