న్యూఢిల్లీ,(విజయక్రాంతి): దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించిన బీఆర్ఎస్(Bharatiya Rashtra Samiti) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ(Union Minister Nitin Gadkari)ని కేటీఆర్ కలిశారు. జాతీయ రహదారి ఎన్ హెచ్-368బి సూర్యాపేట నుండి సిరిసిల్ల వరకు ప్రపోజల్‌ను వేములవాడ నుండి కోరుట్ల వరకు విస్తరించాలని విజ్ఞప్తి చేసి వినతిపత్రం అందజేశారు. విస్తరణ వల్ల ఈ రహదారి వెంబడి ఉన్న తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలు వేములవాడ, కొండగట్టు, ధర్మపురి మరింత అనుసంధానమవుతాయని, నేషనల్ హైవే 63కి అనుసంధానం కలుగుతుందన్నారు.
గతంలోనే బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ ప్రతిపాదనలు చేశారని గుర్తు చేశారు. మానేరు నది(Manair River)పై రోడ్డు కమ్ రైల్ బ్రిడ్జి నిర్మించాలని గడ్కరీని కేటీఆర్ బృందం కోరింది. ఈ ప్రతిపాదనలు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయని కేంద్ర మంత్రికి బీఆర్ఎస్ ప్రతినిధులు తెలియజేశారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసిన బృందంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎంపీ వినోద్ బోయిన్ పల్లి, రాజ్యసభలో బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ సురేష్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు దామోదర్ రావు, వద్దిరాజు రవిచంద్ర, పార్థసారథి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.