06-02-2025 04:40:19 PM
న్యూఢిల్లీ,(విజయక్రాంతి): దేశ రాజధాని ఢిల్లీలో బీఆర్ఎస్(Bharatiya Rashtra Samiti) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KT Ramarao) గురువారం పర్యటించారు. యూజీసీ కొత్త మార్గదర్శకాల(New UGC Guidelines)పై తామ అభిప్రాయాలను నివేధించామన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో కేటీఆర్(KTR) మీడియాతో మాట్లాడుతూ.. తామ అభిప్రాయాలను తెలియజేసేందుకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్(Union Minister Dharmendra Pradhan)ను కలిశామన్నారు. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా యూజీసీ నూతన నిబంధనలు రూపొందించారు. కొత్త నియమాలు రాష్ట్ర విశ్వవిద్యాలయాలలో శోధన కమిటీల బాధ్యతను గవర్నర్ల నియంత్రణలో ఉంచారని, ఇది సమాఖ్య సూత్రాలను దెబ్బతీస్తుందని ఆయన విశ్వసిస్తున్నారు.
నూతన మార్గదర్శకాల వల్ల ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని, గవర్నర్ల ద్వారా విశ్వవిద్యాలయాలపై నియంత్రణను కేంద్రీకరించడమే లక్ష్యమని కేటీఆర్ వాదించారు. సహకార సమాఖ్య స్ఫూర్తికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని కోరుతూ యూజీసీ(University Grants Commission) నిబంధనలపై అభ్యంతరాలను వివరిస్తూ ఆరు పేజీల నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించామని కేటీఆర్ పేర్కొన్నారు. ఇక, సిరిసిల్ల నుంచి కోరుట్ల వరకు ఎన్హోచ్-365బీ రహదారిని విస్తరించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరినట్లు కేటీఆర్ తెలిపారు.