calender_icon.png 17 October, 2024 | 7:42 PM

గ్రూప్-1 అభ్యర్థులతో కేటీఆర్ భేటీ

17-10-2024 05:18:29 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): గ్రూప్-1 అభ్యర్థులతో తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం భేటీ అయ్యారు. అభ్యర్థుల డిమాండ్లను విన్న కేటీఆర్ వారికి న్యాయసాయం అందిస్తామన్న భరోసా ఇచ్చారు. పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ మొండిగా వ్యవహరిస్తుందని, ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 29 రాజ్యాంగ విరుద్ధమన్నారు. దీంతో రిజర్వేషన్ల విషయంలో అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందని అభ్యర్థులు కేటీఆర్‌కు వివరించారు. గ్రూప్-1 పరీక్షపై 22 కేసులు కోర్టులో ఉన్నప్పటికీ, ప్రభుత్వం మొండిగా పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూలును ఖరారు చేసినట్లు అభ్యర్థులు తెలిపారు. సుప్రీంకోర్టుకు వెళ్తే ఎగ్జామ్స్ రద్దు కావచ్చని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు.

పరీక్షల నిర్వహణకు ముందు న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉందని అభ్యర్థులు అభిప్రాయపడ్డడంతో వారి పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఎగ్జామ్స్‌ను రీషెడ్యూల్ చేయడం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ...  గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్ రీషెడ్యూల్ చేసేల ప్రభుత్వంపై ఒతిడి తీసుకురావాలని అభ్యర్థులు కేటీఆర్ కోరారు. దీంతో అభ్యర్థుల డిమాండ్ ను సానుకూలంగా పరిశీలించాలని కేటీఆర్ ప్రభుత్వాన్ని కోరారు. అభ్యర్థులే ఎగ్జామ్ రీషెడ్యూల్ చేయాలని కోరినా, ప్రభుత్వం ఎందుకు మొండి పట్టుదలకు పోతోందని ఆయన ప్రబుత్వాన్ని ప్రశ్నించారు. అశోక్ నగర్‌లో ఆందోళన చేపట్టిన అభ్యర్థులను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని కేటీఆర్ ఖండించారు. వారిని వెంటనే విడుదల చేసి, కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.