calender_icon.png 15 November, 2024 | 1:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లగచర్ల ఘటన.. అరెస్టైన వారితో కాసేపట్లో కేటీఆర్ ములాఖత్

15-11-2024 11:43:32 AM

హైదరాబాద్: వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలో అరెస్టు అయిన వారితో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాసేపట్లో ములాఖత్ కానున్నారు. సంగారెడ్డి సెంట్రల్ జైలులో లగచర్ల బాధితులతో ములాఖత్ కోసం కేటీఆర్ సహా ఆరుగురికి అనుమతి లభించింది. నిన్న 16 మంది లగచర్ల నిందితులను కంది సెంట్రల్ జైలుకు తరలించారు. కంది కేంద్రం కారాగారం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కారాగారానికి 500 మీటర్ల పరిధిలో ఎవరినీ పోలీసులు అనుమతించడం లేదని పోలీసులు వెల్లడించారు. 

లగచర్ల దాడి కేేసులో మరో పది మందిని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అదుపులోకి తీసుకున్న వారిని గోప్యంగా ఉంచి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి కలెక్టర్, అధికారులపై దాడికి పాల్పడిన మరికొంత మందిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అదుపులో ఉన్న వారిని సాయంత్రం లోపు రిమాండ్ చేసే అవకాశముందని పోలీసులు తెలిపారు.