calender_icon.png 9 January, 2025 | 10:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ కొడుకుగా.. తెలంగాణ కోసం చస్తాను తప్ప.. తప్పు చేయను

09-01-2025 10:19:58 AM

పైసా అవినీతి కూడా చేయలేదు

తెలంగాణ కోసం చస్తా తప్పా.. తప్పుడు పనులు చేయను

హైదరాబాద్: కేటీఆర్ తన తరుపు న్యాయవాది రామచంద్రరావుతో కలిసి ఏసీబీ విచారణకు బయలుదేరారు. విచారణకు ముందు నందినగర్ నివాసంలో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్(Telangana Brand image) ను ప్రపంచ పటంలో పెట్టడానికి కృషి చేశానని కేటీఆర్ పేర్కొన్నారు. కేబినెట్ లో ఉండి నా కుమారుడికి కాంట్రాక్టులు ఇవ్వలేదని వివరించారు. ఈ ఫార్ములా రేసులో పైసా అవినీతి కూడా చేయలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. తాను ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే దొంగను కాదన్నారు. నిజం నిలకడగా తెలుస్తుందన్న తాము మీ డైవర్షన్ లకు లోనుకామని స్పష్టం చేశారు. నువ్వు చేసిన అన్ని దుశ్చర్యలను అడ్డుకున్నది బీఆర్ఎస్ అన్నారు. కేటీఆర్ ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోతే ప్రశ్నించింది బీఆర్ఎస్ అన్నారు. ముమ్మాటికీ రేవంత్ ఇచ్చిన హామీల గురించి ప్రశ్నింస్తునే ఉంటామని తెలిపారు. కేసీఆర్ కుమారిడిగా తెలంగాణ కోసం చస్తా తప్పా.. తప్పుడు పనులు చేయనని పేర్కొన్నారు. ఫార్ములా ఈ-కార్‌ రేసు కేసులో కేటీఆర్‌ను ప్రశ్నిస్తారా? ఇంకేమైనా చర్యలు తీసుకుంటారా అని పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఏసీబీ కార్యాలయం దగ్గర భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.