23-02-2025 12:35:43 AM
కరీంనగర్, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): కేటీఆర్.. నోరు హద్దులో ఉంచి మాట్లాడు... నీ చిట్టా అంతా నా దగ్గర ఉంది, బండారమంతా బయట పెడతానంటూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమా ర్ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఫైరయ్యారు.
శనివారం కరీంనగర్‌లోని కొండ సత్యలక్ష్మీగార్డెన్‌లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ ప్రబారీల విస్తృత సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజ రైన కేంద్రమంత్రి బండి సంజయ్ కేటీఆర్‌కు పనీపాట లేదని, అతన్ని ప్రజలెవరూ పట్టించుకోవడం లేదంటూ ఎద్దేవా చేశారు.
మ్మె ల్సీ అభ్యర్థులే దొరకక ఎన్నికల బరి నుంచి పారిపోయి లోపాయికారిగా కాంగ్రెస్‌కు మద్దతునిస్తున్నారని ఆరోపించారు. అందుకే కాళే శ్వరం అవినీతి, ఫోన్ ట్యాపింగ్, కేటీఆర్ బామ్మర్ది ఫాంహౌజ్‌లో డ్రగ్స్ కేసు, ఫార్మలా ఈ స్కామ్‌లో కచ్చితమైన ఆధారాలున్నా అరెస్ట్ చేయడం లేదని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి, సంజయ్ ఆర్‌ఎస్ బ్రదర్స్ అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొడుతూ.. నిజమైన కేఆర్ బ్రదర్స్ కేటీఆర్, రేవంత్‌రెడ్డి అంటూ ఎద్దేవా చేశారు.
తాను సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఉద్యమాలు చేసి ఈ స్థాయికి వచ్చానని పేర్కొ న్నారు. కాంగ్రెస్‌కి బీఆర్‌ఎస్ ఏటీఎంలా మారిందన్నారు. మీ లాగా పైసలు, బీరు, బిర్యానీలతో సభలు పెట్టి పార్టీ నడిపే చరిత్ర బీజేపీది కాదని పేర్కొన్నారు. ఆరు గ్యారంటీలతో కాంగ్రెస్ చేసిన మోసాలు, అవినీతి, అక్రమాలు, 15 శాతం కమీషన్ వివరాలపై బహిరంగ చర్చకు సిద్ధమని, తేదీ, సమయం, వేదిక చెప్పాలన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డికి దమ్ముంటే చర్చ నిర్వహించాలని సవాలు విసిరారు. ఎస్‌ఎల్‌బీసీ సొరం గం పైకప్పు కూలిన దుర్ఘటన పట్ల కేంద్రమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు వెంట నే మెరుగైన సాయం అందించాలని కోరారు. ఘనట పై పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాం డ్ చేశారు.