ఆగిన కమ్యూనిటీ హాల్ ప్రారంభం తాళం వేసిన మున్సిపల్ అధికారులు
సిరిసిల్ల, జనవరి 24 (విజయక్రాంతి): స్వంత ఇలాకాలో కేటీఆర్ కు చుక్కెదురైంది. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 5వ వార్డు సుభాష్ నగర్ కమ్యూనిటీ హాల్ ప్రారంభంతో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు శుక్రవారం సిరిసిల్ల మున్సిపల్ పాలకవర్గం సిద్ధం చేసింది. కాగా కమ్యూనిటీ హాల్ కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించాల్సి ఉండగా తీరా సమయానికి మున్సిపల్ అధికారులు భవనానికి తాళాలు వేశారు.
ఈనెల 26న పాలకవర్గం పదవి కాలం ముగుస్తుండటంతో స్థానిక కౌన్సిలర్ తన హయాంలో ప్రారంభిం చేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. మున్సిపల్ అధికారులు కమ్యూనిటీ హాల్ కు తాళాలు వేయడంతో జిల్లా కేంద్రంలో చర్చనీ యాంశంగా మారింది. కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్స వానికి వచ్చిన కేటీఆర్ ఇతర కార్యక్రమా లకు హాజరయ్యారు.
కేటీఆర్ కు చెక్ పెట్టేందుకే కమ్యూనిటీ హాల్ భవన ప్రారంభోత్సవాన్ని, కాంగ్రెస్ నేతలు ఆపి ఉంటారని స్థానిక బిఆర్‌ఎస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. కమ్యూనిటీ భవన నిర్మాణ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ నాణ్యత లోపంతో పనులు పూర్తి చేశాడని, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు స్థానికులు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
అందుకే మున్సిపల్ అధికారులు కమ్యూనిటీ హాలుకు తాళాలు వేసి ప్రారంభోత్సవాన్ని ఆపినట్లు సమాచారం. ఏది ఏమైనా కేటీఆర్ ఇలాగాలోనే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో స్థానికంగా చర్చ సాగుతోంది.