calender_icon.png 19 January, 2025 | 5:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్ జైలుకెళ్లడం ఖాయం

19-01-2025 12:40:46 AM

* తప్పు చేయకపోతే భయమెందుకు? 

* ఎంపీ రేణుకాచౌదరి 

ఖమ్మం, జనవరి 18 (విజయక్రాంతి): కేటీఆర్ జైలుకెళ్లడం ఖాయమని, తప్పు చేయనప్పుడు కేటీఆర్ ఎందుకు భయపడుతున్నారని కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి అన్నారు. శనివారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాల   జరిగిన మీడియా సమావేశంలో ఆమె బీఆర్‌ఎస్‌పై మండిపడ్డారు. త్వరలోనే బీఆర్‌ఎస్ చర్రిత ముగుస్తుందని ధ్వజమెత్తారు.

ఢీల్లీలో బీజేపీ నేతలతో కేటీఆర్ మంతనాలు చేస్తున్నారని ఆరోపించారు. హరీశ్‌రావు ఢీల్లీ పెద్దలతో ఏసీబీ కేసు నుంచి బయటపడేందుకు లాబీయింగ్ చేస్తున్నారని ఆరోఁ పించారు. బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటేనని విమఛ ర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి రేయింబవళ్లు శ్రమిస్తూ విదేశీ పెట్టుబడులను ఆక  రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్నారని అన్నారు.

కేంద్రం తెస్తున్న వన్ నేషన్ వన్ ఎలక్షన్ అమలు కష్టమన్నారు. మోదీ ప్రభు  అన్ని అంశాల్లో విఫలమైందని విమర్శించారు. సోషల్ మీడియా ద్వారా రాహుల్‌గాంధీపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని, వాస్తవాలు ప్రజలకు తెలుసన్నారు. సమావేశంలో టీపీసీసీ అధికార ప్రతినిధి, ప్రచార కార్యదర్శి రత్నాకర్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.