calender_icon.png 19 January, 2025 | 7:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్ జైలుకు పోవడం ఖాయం

19-01-2025 12:00:00 AM

కాంగ్రెస్ చేవెళ్ల నియోజకవర్గ ఇంచార్జి పామెన భీమ్ భరత్ 

చేవెళ్ల, జనవరి 18: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జైలుకు పోవడం ఖాయమని, ఫ్ట్రస్టేషన్లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ చేవెళ్ల నియోజకవర్గ ఇన్చార్జి పామెన భీమ్ భరత్ విమర్శించారు. ఆయన కేబినెట్ ఆమోదం లేకుండా.. అధికారులకు తెలియకుండా రూ.50 కోట్ల విదేశాలకు పంపి అవితీనికి పాప్పడ్డారని ఆరోపించారు. శనివారం పార్టీ నేతలతో కలిసి షాబాద్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ ఆఫీసు నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు.

అనంతరం శుక్రవారం జరిగిన రైతు ధర్నా ప్రదేశాన్ని చీపుళ్లతో శుభ్రం చేసి... పసుపు నీళ్లతో కడిగేశారు. అనంతరం పార్టీ ఆఫీసులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్ లాగా హామీ ఇచ్చి తప్పించుకోలేదన్నారు. పదేండ్లలో  నిరసన తెలిపే ధర్నా చౌక్ను కూడా ఎత్తేసిన కేటీఆర్ ఇప్పుడు రైతుల పేరిట దీక్షలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. జనవరి 26 నుంచి రైతుభరోసా కింద రైతులకు ఎకరాకు రూ.15 వేలు ఇవ్వబోతున్నామని, త్వరలోనే రైతు కూలీలకు కూడా రూ.12వేలు ఇస్తామని ప్రకటించారు.

బీఆర్‌ఎస్ మాదిరిగా రోడ్లు, గుట్టలు, వెంచర్లు, వాగులకు కాకుండా సాగుకు యోగ్యమైన భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని స్పష్టం చేశారు.  అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు,  రేషన్ కార్డులు కూడా మంజూరు చేస్తామని తెలిపారు. 

బీఆర్‌ఎస్ నేతలు బూటకపు మాటలు నమ్మోద్దని, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో తప్పకుండా  ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని వెల్లడించారు.  సర్దార్ నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పీసరి సురేందర్ రెడ్డి, టీపీసీసీ అధికార అధికార ప్రతినిధి గౌరి సతీష్, నాయకులు రాంరెడ్డి, పామెన నర్సింలు, మంగలి చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.