calender_icon.png 30 January, 2025 | 8:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా ప్రభుత్వ పాలనను కేటీఆర్ జీర్ణించుకోవడం లేదు

30-01-2025 01:27:04 AM

కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి 

హైదరాబాద్, జనవరి 29 ( విజయక్రాంతి) :  ప్రజా ప్రభుత్వ పాలనను కేటీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే రోజుకు మూడు ప్రెస్ మీట్లు, నాలుగు ట్వీట్లు పెడుతున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఎద్దేవా చేశారు. గాంధీభవన్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణకు పెట్టుబడులు వస్తుంటే కేటీఆర్ మింగుడుపడటం లేదని ఆయన మండిపడ్డారు.

నల్లగొండలో నిర్వహించిన రైతు ధర్నా అట్టర్ ప్లాప్ అయిందన్నారు.  హైదరాబాద్‌కు ట్రిపు ల్ ఆర్ అనేది ఒక లైఫ్‌లైన్ అని, తెలంగాణ రాష్ట్రం 50 శాతం అర్భనైజేషన్ కావడానికి ఎంతో దోహదపడుతుందన్నారు. ట్రిపుల్ ఆర్ నిర్మాణానికి రూ. 34,367 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసినట్టు చెప్పారు.

ఈ  అం శంపై ఇప్పటికే కేంద్ర మంత్రులను కూడా కలిసినట్లు వెల్లడించారు. తెలంగాణ అభివృద్దికి కేంద్రం నుంచి నిధులు సాధించడంలో కాంగ్రెస్ ఎంపీలకు ఎం త బాధ్యత ఉందో, బీజేపీ ఎంపీలకూ అంతే బాధ్యత ఉందని గుర్తు చేశారు.

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి సాధ్యమైనంత ఎక్కువ నిధులు తీసుకురావడం తమ బాధ్యత అన్నారు. పాలమూరు. రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, విభజన హామీలు, ఐఐఎం లాంటి ప్రాజెక్టులు ఎన్నో కేంద్రం నుంచి రావాల్సి ఉందని, వాటి కోసం పోరాటం చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు.