calender_icon.png 9 January, 2025 | 4:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయం

07-01-2025 01:55:52 AM

  • కుర్చీ కోసం ముగ్గురు కుస్తీ

హరీశ్‌రావు వేరే పార్టీ చూసుకోవాల్సిందే

మతం పేరిట బీజేపీ రాజకీయం 

టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్

ఆదిలాబాద్, జనవరి 6 (విజయక్రాంతి): ప్రజా ధనాన్ని అప్పనంగా ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం చేసిన కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ జోస్య చెప్పారు. ఈ రేస్‌లో కేటీఆర్ అడ్డంగా దొరికిపోయారన్నారు. జైలుకు వెళ్లడానికైనా సిద్ధం అన్న కేటీఆర్.. తరాత పనికి రాని, పసలేని కేసు అని కోర్టును ఎందుకు ఆశ్రయించారని ప్రశ్నించారు.

ఆదిలాబాద్‌లో సోమవారం నిరహించిన పార్లమెంట్ స్థాయి నాయకులు, కార్యకర్తల సమావేశానికి తెలంగాణ రాష్ర్ట ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, ఆల్ ఇండియా జనరల్ సెక్రెటరీ విశనాథన్, జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్కతో కలిసి మహేశ్‌కుమార్‌గౌడ్ హాజరయ్యారు. అనంతరం మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ... అధికారం కోల్పోయిన అక్కసుతో బీఆర్‌ఎస్ నేతలు దారుణంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

అధ్యక్ష కుర్చీ కోసం కేటీఆర్, కవిత, హరీశ్‌రావు కొట్లాడుతున్నారని, అందులో అమాయకుడైన హరీశ్‌రావు వేరే పార్టీ చూసుకోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. అసెంబ్లీకి రాకుండా ఫామ్‌హౌస్‌లోనే ఉంటున్న కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా ఎందుకని ప్రశ్నించారు. కాళేశరం వృథా ప్రాజెక్టు అని, ప్రపంచంలోనే అత్యంత ప్రజాధనం దురినియోగం, దోపిడీ చేసిన కుటుంబం కేసీఆర్ కుటుంబం అని ఆరోపించారు.

బీఆర్‌ఎస్ శఖం ముగిసిందని, వచ్చే ఎన్నికల నాటికి ఆ పార్టీ ఉండదని జోష్యం చెప్పారు. తండ్రీ కొడుకులు తప్పా ఆ పార్టీలో ఎవరు ఉండరని అన్నారు. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మతం పేరిట రాజకీయం చేస్తుందన్నారు. తరచూ అంబేద్కర్‌ని అవమానించడం చూస్తే రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తున్నదన్నారు. 

నఫ్రత్ చోడో.. ఆదిలాబాద్ జొడో: దీపాదాస్ మున్షీ

ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ బలహీనం కాదని ఇక్కడి కార్యకర్తల ఉత్సాహం చూస్తే తెలుస్తున్నదని పార్టీ రాష్ర్ట ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ అన్నారు. నాయకుల మధ్య సఖ్యత లేని కారణంగానే పార్టీ నష్టపోతుందన్నారు. నాయకులు కలిసి పని చేయాలని అందుకు నఫ్రత్ చోడో.. ఆదిలాబాద్ జోడోగా ముందుకు వెళ్లాలని దీపాదాస్ మున్షీ పిలుపునిచ్చారు. 

అంతర్గత సమస్యల వల్లే..: సీతక్క

పార్టీలో అంతర్గత సమస్యల వల్లనే గత పార్లమెంట్ స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చిందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో పార్టీ గెలుపు కోసం అందరూ కలిసిమెలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఒక్క నాయకుని కోసం కాకుండా పార్టీ గెలుపు కోసం పని చేయాలన్నారు. జిల్లాలో నామినేటెడ్ పదవుల కోసం 10 మంది నాయకులు 10 రకాల పేర్లు ఇస్తే తాను కూడా ఏమీ చేయలేనన్నారు.

పార్టీలో క్రియాశీలకంగా ఉన్న నాయకునికి సముచిత స్థానం లభిస్తుందన్నారు. ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదరి వేణుగోపాల్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఎమ్మెల్సీ దండే విఠల్, మాజీ మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, సముద్రాల వేణుగోపాలచారి, డీసీసీబీ అధ్యక్షుడు అడ్డి బోజారెడ్డి, నిర్మ  ఆసిఫాబాద్ జిల్లాల అధ్యక్షులు  విశప్రసాద్, శ్రీహరిరావు, ఆదిలాబాద్, బో  నియోజకవర్గాల ఇన్‌చార్జి కంది శ్రీనివాస్‌రెడ్డి, ఆడే గజేందర్ పాల్గొన్నారు.