calender_icon.png 18 January, 2025 | 4:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్ మెంటల్ ఆస్పత్రికి వెళ్లడం ఖాయం

18-01-2025 12:45:19 AM

కాంగ్రెస్ ఎంపీ చామల

హైదరాబాద్, జనవరి 17 (విజయక్రాంతి): మాజీమంత్రి కేటీఆర్‌కు నోటి దురుసు ఎక్కువైందని, త్వరలోనే మెంటల్ ఆస్పత్రికి వెళ్లడం ఖాయమని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.  బీఆర్‌ఎస్ హయాంలో పనికిరాని పాలన చేయడమే కాకుండా.. ఇప్పుడు పనికిరాని రాజకీయం చేస్తున్నారని శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో విమర్శించారు. 

కేటీఆర్ చేసిన స్కాము లన్ని బయటికి రాబోతున్నాయని, వాటన్నింటికి తగిన శిక్ష అనుభవించకతప్పదన్నారు. సాగుచేసే భూములకు మాత్రమే రైతు భరో సా ఇస్తామని చెప్పామన్నారు. ఎన్నికల్లో తామిచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తామని చెప్పారు. ప్రతిపక్ష నాయకులు వాస్తవాలు మాట్లాడాలని, ప్రభుత్వానికి మంచి సలహాలు ఇవ్వాలని సూచించారు.