calender_icon.png 19 April, 2025 | 11:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెచ్‌సీయూ భూముల వ్యవహారం వెనుక కేటీఆర్!

11-04-2025 12:24:24 AM

బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): హెచ్‌సీయూ భూముల వ్యవహారం వెనుక బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నాడనే అనుమానం తమకుందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపిం చారు. గురువారం బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశం లో ఆయన మాట్లాడారు.

హెచ్‌సీయూ భూ ముల వ్యవహారంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కుమ్మక్కైనట్టు అనిపిస్తోందని విమర్శించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి బుడ్డర్‌ఖాన్‌ల మాట్లాడుతున్నారని ఆరోపించారు. రాహుల్ మెప్పు కోసమే అలా మాట్లాడారని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని రాహుల్ గాంధీ పాదాల వద్ద తాకట్టు పెట్టారని విమర్శించారు. స్థాయిని మించి మోదీపై విమర్శలు చేయడం మానుకోవాలని సీఎంకు హితవు పలికారు. రాజ్యాంగేతర శక్తిలా తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జీ మీనాక్షి నటరాజన్ సెక్రటేరియేట్‌లో అడుగు పెట్టారని, సీఎం లేనప్పుడు అజ్ఞాత వ్యక్తి సచివాలయంలో సమీక్ష నిర్వహించడం చరిత్రలో ఎప్పుడూ లేదన్నారు