28-08-2024 01:09:36 AM
ఎమ్మెల్యేలు రాజాసింగ్, శంకర్
హైదరాబాద్, ఆగస్టు 27 (విజయక్రాంతి): కేటీఆర్ చదువుకున్న మూర్ఖుడని బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, పాయల్ శంకర్ వేర్వేరు ప్రకట నల్లో విమర్శించారు. కవిత బెయిల్ అంశంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన ట్వీట్‌లో తప్పేముందని వారు ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్ ను సంజయ్ వ్యతిరేకించలేదని, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒక్కటేననే విషయాన్ని బహిర్గతం చేశారని అన్నారు. కవిత కు బెయిల్ కోసం వాదించిన వ్యక్తికి కాంగ్రెస్ రాజ్యసభ టిక్కెట్ ఇచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు.
38 మంది ఎమ్మెల్యేలున్నా రాజ్యసభకు బీఆర్‌ఎస్ ఎందుకు నామినేషన్ వేయలే దని ప్రశ్నించారు. కేకే ఎంపీ పదవికి రాజీనామా చేస్తే ఆ సీటును కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యక్తికి ఎందుకివ్వలేదన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఏకగ్రీవమ య్యేందుకే బీఆర్‌ఎస్ తరపున అభ్యర్ధిని నిలబెట్టలేదన్నది నిజం కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ‘క్విడ్ ప్రో కో’ రాజకీయాలకు ఇంతకంటే నిదర్శనం అవసరం లేదన్నారు. త్వరలోనే కాంగ్రెస్‌లో బీఆర్ ఎస్ విలీనం కావడం తథ్యమని తెలిపారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్‌కు మెదడు ఉండే మాట్లాడుతున్నారా అని అన్నారు.