హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనపై ఎక్స్ వేదికగా మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. అమెరికా, దక్షిణ కొరియా వెళ్లిన సీఎం, మంత్రులకు కేటీఆర్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి పదేళ్లు కృషి చేశామని కేటీఆర్ పేర్కొన్నారు. అదే స్ఫూర్తిని రేవంత్ సర్కార్ కొనసాగిస్తుందని ఆశిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ కు, తనకు రాష్ట్ర అభివృద్ధే మొదటి ప్రాధాన్యం అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఆర్థికాభివృద్ధికి అనుకూలమైన పర్యావరణ వ్యవస్థను రూపొందించడానికి స్థిరంగా ప్రాధాన్యతనిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు పెట్టుబడుల ఆకర్షించటమే లక్ష్యంగా అమెరికా వెళ్లారు.