calender_icon.png 28 December, 2024 | 6:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్‌కు అరెస్టు భయం

08-11-2024 01:23:14 AM

ఫార్ములావన్‌పై మాట్లాడం విచిత్రం ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ 

హైదరాబాద్, నవంబర్ 7 (విజయక్రాంతి): డ్రగ్స్‌పై స్పందించని కేటీఆర్.. ఫార్ములావన్‌పై మాట్లాడటం విచిత్రంగా ఉందని,  అరెస్టు అవుతాననే భయం  కేటీఆర్‌కు పట్టుకుందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. పేవర్ వర్క్, క్యాబినెట్ ఆమోదం లేకుండానే ఫార్ములావన్‌కు నిధులు ఎలా సమకూర్చుతా రని ప్రశ్నించారు. మంత్రిగా ఉండి ఈ విధంగా చేయవచ్చా అని మండిపడ్డారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. ఫార్ములావన్‌లో ప్రొసీజర్స్ పాటించలేదన్నారు. ప్రజల డబ్బును దుర్వినియోగం చేస్తే వంద శాతం జైలుకు పంపుతామని, ఎవిడెన్స్ ఆధారంగానే చర్యలు ఉంటాయన్నారు. తప్పు చేయకపోతే ఏ విధంగా పార్ములావన్‌ను ఓ కంపెనీకి కట్టబెట్టారని, లోపాయికారీ ఒప్పందాలతోనే జరిగిందన్నారు.