calender_icon.png 3 October, 2024 | 10:01 AM

కేటీఆర్ డ్రగ్స్ కు బానిస

03-10-2024 02:39:18 AM

సమంత- నాగ చైతన్య విడాకులకు ఆయనే కారణం 

ఎంతోమంది హీరోయిన్ల జీవితాలు నాశనం చేశాడు

ఆయన నిర్వాకంతో చలామంది సినిమా వదిలివెళ్లారు

ఎన్ కన్వెన్షన్ కూల్చుతామని నాగార్జునను బెదిరించారు 

ఆ సమయంలో సమంతను బలిచేయాలని చూశారు

అందుకే ఆమె తన భర్తతో విడిపోవాల్సి వచ్చింది

కేటీఆరే నాపై దుబాయ్ నుంచి ట్రోలింగ్ చేయిస్తున్నారు

ఫోన్ ట్యాపింగ్ ద్వారా చాలా మందిని ఇబ్బందిపెట్టారు 

మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు 

హైదరాబాద్, అక్టోబర్ 2 (విజయక్రాంతి)/కార్వాన్: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై రాష్ట్ర మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. కేటీఆర్ మత్తు పదార్థాలకు అలవాటు పడి మహిళలకు కూడా వాటిని అలవాటు చేశార ని, రేవ్ పార్టీలు కూడా పెట్టారని   ఆరోపించారు.

బ్లాక్ మెయిల్ చేసి ఎంతో మంది సినిమావాళ్ల జీవితాలతో ఆడుకున్నారని విమర్శించారు. బుధవారం ఆమె గాంధీభవన్‌లో, అంతకు ముందు లంగర్‌హౌస్‌లో బాపుఘాట్ వద్ద మీడియాతో మాట్లాడారు. ‘కేటీఆర్‌కు మహిళలు అంటే చిన్నచూపు. చాలామంది సినిమా హీరోయిన్ల జీవితాలతో ఆడుకుంటున్నాడు. సమంత నాగచైతన్యతో పాటు చాలా మంది  విడిపోవడానికి కేటీఆరే కారణం.

దీంతో కొందరు హీరోయిన్లు సినిమా ఫీల్డ్ నుంచి అర్థంతరంగా తప్పుకున్నా రు. సినిమా పరిశ్రమలో ఈ విషయం బహిరంగ రహస్యం. నా వ్యక్తిత్వాన్ని కించపర్చేలా పోస్టులు పెడుతున్నారు. ఆ పోస్టులను కేటీఆర్ ఎందుకు ఖండించలేదు? మహిళలను కించపర్చేలా పోస్టులు పెట్టమని కేటీఆర్ తన టీమ్‌కు చెప్పారు.

దుబాయ్ నుంచి సోషల్ మీడియా నడుస్తోంది. పద్ధతి పాడు లేకుండా ఇష్టారీతిలో బీఆర్‌ఎస్ సోషల్ మీడియా రెచ్చిపోతుంది. మొన్న సీతక్కను, నగర మేయర్ విజయలక్ష్మితో పాటు ఇప్పుడు నన్ను ట్రోల్ చేస్తున్నారు. మనసున్న మనిషిగా హరీష్‌రావు ఖండించారు.

కేటీఆర్.. నువ్వు మనిషివేనా? ఇప్పటివరకు ఎందుకు ఖండించలేదు? సోషల్ మీడియా అకౌంట్ తనదికాదని అన్నప్పుడు వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పాలి కదా? కేటీఆర్‌కు తల్లి, చెల్లెలు ఉన్నారు కాదా?  రాజకీ య విలువలు దిగజారిపోయాయి. ప్రభు త్వం తప్పు చేస్తే ఎత్తి చూపాలి. వ్యక్తుల వ్యక్తిత్వాన్ని దెబ్బతీయవద్దు’ అని మంత్రి హితవు పలికారు.

గతంలో నాగార్జునకు సంబందించిన ఎన్ కన్వెన్షన్ కూల్చుతామని కేటీఆర్ బెదిరించారని, ఈ విషయంలో సమంతను బలి చేయాలని చూస్తే.. ఆమె ఒప్పుకోకపోవడంతో భార్యాభర్తల మధ్య విడాకులు అయ్యాయని మంత్రి సురేఖ ఆరోపించారు. 

కేటీఆర్‌కు తల్లి, చెల్లెలు ఉన్నారు కదా? 

బీఆర్‌ఎస్ సోషల్ మీడియా నుంచి అసభ్యకరమైన పోస్టులు వస్తే ఊరుకునేది లేదని మంత్రి సురేఖ హెచ్చరించారు. అలాంటి పోస్టులపై ఇప్పటికే సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేశామని, భవిష్యత్‌లో ఇలా జరిగితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. గతంలో ఫోన్ ట్యాఫింగ్ ద్వారా అందరిని ఇబ్బందులకు గురిచేశారని ఆమె ఆరోపించారు.

బతుకమ్మ పండుగకు ఏం ఇవ్వానేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీలో మహిళలను ఎదగనీయరని, గతం లో బీఆర్‌ఎస్‌లో తనతోపాటు బొడిగ శోభ, రేఖానాయక్‌కు మంత్రి పదవులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఆ పార్టీలో కుటుం బ పాలనే నడవాలని అనుకుంటారని విమర్శించారు.

తనపై సోషల్ మీడియా లో వచ్చిన ట్రోల్‌పై మహిళా కమిషన్ సుమోటోగా కేసు నమోదుచేసిందని తెలిపారు. బీఆర్‌ఎస్‌లాగా తాము సోషల్ మీడియాను దుర్వినియోగం చేయటంలేదని మంత్రి పేర్కొన్నారు. మూసీ నది చుట్టూ ఉన్నవారిని గుర్తించి వారికి డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చిన తర్వాతనే అక్కడి నుంచి ఖాళీ చేయిస్తామని చెప్పారు. ఇప్పటివరకు మూసీ చుట్టు ఉన్న ఇళ్లలో ఒక్కటి కూడా కూల్చలేదని అన్నారు.