calender_icon.png 23 October, 2024 | 6:58 AM

కేటీఆర్ రాజకీయ అజ్ఞాని

23-10-2024 02:37:46 AM

  1. దండుపాళ్యం బ్యాచ్‌కు లీడర్
  2. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

హైదరాబాద్, అక్టోబర్ 22 (విజయక్రాం తి): బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు రాజకీయ పరిజ్ఞానం లేదని, ప్రతి అంశంపై చిన్న పిల్లాడిలా మాట్లాడుతున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. సీఎం రేవంత్‌రెడ్డి ఎంత మంచి పనిచేసినా, దానిని చెడుగా వక్రీకరించేందుకు కేటీఆర్, హరీశ్‌రావు ప్రయత్నిస్తున్నారని, బీఆ ర్‌ఎస్ సోషల్ మీడి యా కన్యూజ్ చే స్తోందని మండిపడ్డారు.

మంగళవారం ఆయన గాంధీభవన్ లో మాట్లాడుతూ కేటీఆర్ దండుపాళ్యం బ్యాచ్‌కు నాయకుడిగానే పనిచేస్తున్నారని విమర్శించారు. దామగుండం రాడార్‌కు జీవో ఇచ్చింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని చెప్పారు. రేవంత్‌రెడ్డి దగ్గర కేటీఆర్ రాజకీయం నేర్చుకోవాలని సూచించారు.