calender_icon.png 1 February, 2025 | 8:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాజా మాజీ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లను సన్మానించిన కేటీఆర్

01-02-2025 12:00:00 AM

మెదక్, జనవరి 31 (విజయ క్రాంతి) : ఇటీవల పదవి కాలం ముగిసిన మున్సిపల్ చైర్మన్లను, వైస్ చైర్మన్లను శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ రాష్ర్ట వ ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘనం గా సన్మానించారు. మెదక్ తాజా మాజీ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, రామాయంపేట తాజా మాజీ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, తూప్రాన్ రవీందర్ గౌడ్, నర్సాపూర్ అశోక్ గౌడ్ లను శాలువాతో మెమొంటోను అందజేసి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పదేళ్లలో మున్సిపల్ చైర్మన్లు,  వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు. రాబోయే స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని అన్నారు. మెదక్ జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షురాలు పద్మాదేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి పాల్గొన్నారు.